యాత్ర సినిమా పై రియాక్ట్ అయిన విజయమ్మ

Ruthvik
Published on: 12 Feb 2019 5:25 PM IST
యాత్ర సినిమా పై రియాక్ట్ అయిన విజయమ్మ
X

ప్రజా నాయకుడు, ఒక్కప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర' ఫిబ్రవరి 8 వ తారీఖున విడుదలైన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో కనిపించారు మమ్ముట్టి. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ను చూశారు వైయస్సార్ భార్య వైఎస్ విజయమ్మ. సినిమా చూసిన వెంటనే ఆమె చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

"రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రను కీలకాంశంగా తీసుకొని యాత్ర సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్ కు మరియు నిర్మాతలు శశి, విజయ్ కు నా కృతజ్ఞతలు. కోట్లాది మంది గుండెల్లో ఉన్న వైఎస్ ను, ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన సంక్షేమ పథకాలను, ప్రజల కోసం ఆయన పడిన తపన ను 'యాత్ర' సినిమా ద్వారా మళ్లీ చూపించారు." అని పొగిడారు. రాజశేఖర్ రెడ్డి గారిని 40 సంవత్సరాల పాటు ప్రజలు ఎంతగా ఆదరించారో ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని కూడా అలానే ఆదరించారు. ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర గా వచ్చిన ఈ సినిమాను కూడా అంతే ఆదరిస్తారని అన్నారు విజయమ్మ.

Ruthvik

Ruthvik

Next Story