ఎమ్మెల్యేగా అసెంబ్లీ బరిలోకి హీరో విశాల్..

ఎమ్మెల్యేగా అసెంబ్లీ బరిలోకి హీరో విశాల్..
x
Highlights

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి పార్టీలు అంతా రంగం చేసుకుంటున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో హీరో విశాల్ కూడా ఎమ్మెల్యేగా పోటి చేయనున్నాడని తెలుస్తోంది.

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి పార్టీలు అంతా రంగం చేసుకుంటున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో హీరో విశాల్ కూడా ఎమ్మెల్యేగా పోటి చేయనున్నాడని తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో విశాల్ ఆర్. కేనగర్ అసెంబ్లీ నుంచి పోటి చేయాలనీ నామినేషన్ కూడా వేశారు. అయితే చివరి నిమిషంలో నామినేషన్‌ను ప్రతిపాదించిన 10 మందిలో కొంతమంది తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో ఎన్నికల కమిషన్‌ విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరించింది. దీనితో విశాల్ ఆ ఎన్నికల్లో పోటి చేయలేకపోయాడు. అయితే ఈ సారి ఎలాగైనా పోటి చేయాలనీ భావించి తన అభిమాన సంఘాలతో విశాల్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన త్వరలోనే ఓ అధికార ప్రకటన ఇవ్వనున్నాడు విశాల్.. అటు ఇప్పటికే నిర్మాతల సంఘం, నడిగర్ సంఘానికి అధ్యక్షునిగా కొనసాగుతున్నారు విశాల్.

Show Full Article
Print Article
Next Story
More Stories