Nikhil: కార్తికేయ 2 షూటింగ్‌లో ప్రమాదం.. హీరో నిఖిల్‌కు గాయాలు

‍Young Hero Nikhil Injured in karthikeya 2 Movie Shooting
x

హీరో నిఖిల్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Nikhil: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గాయాలపాలయ్యాడు. తను హీరోగా నటిస్తున్న కార్తికేయ 2 సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది.

Nikhil: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గాయాలపాలయ్యాడు. తను హీరోగా నటిస్తున్న కార్తికేయ 2 సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోనే నిఖిల్‌కు స్వల్ప గాయాలపాలయ్యాడని సమాచారం. గుజరాత్‌లో షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే హీరో నిఖిల్ స్వల్ప గాయాలతో బయటపడడంతో టీం ఊపిరిపీల్చుకున్నట్లు సమాచారం.

కాగా, నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ దాదాపు 35 ఏళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories