వైఎస్సార్ పాత్రలో జీవించిన మమ్మూట్టి

Yatra
x
Yatra
Highlights

టాలీవుడ్ లో బయోపిక్ ల వర్షం కురుస్తోంది. ఒకదాని తర్వాత ఒక బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బయోపిక్ లలో 'యాత్ర' సినిమా కూడా ఒకటి.

టాలీవుడ్ లో బయోపిక్ ల వర్షం కురుస్తోంది. ఒకదాని తర్వాత ఒక బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బయోపిక్ లలో 'యాత్ర' సినిమా కూడా ఒకటి. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. టీజర్ తోనే ప్రేక్షకులను మెప్పించిన దర్శక నిర్మాతలు నిన్న ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

రెండు నిమిషాలు నిడివిగల చిత్ర ట్రైలర్ వైఎస్సార్ పాదయాత్ర ముందు ఆయన ఎదుర్కొన్న సమస్యలు పాదయాత్ర చేసే సమయంలో ఆయన అనుభవాలలో కొన్ని చూపించారు ఈ సినిమాలో మమ్ముట్టి నటన చూస్తుంటే నిజంగానే ప్రియ నేత వైఎస్సార్ లాగా కనిపిస్తున్నారు. ఇక హావభావాలు, డైలాగ్ డెలివరీ కూడా వైయస్సార్ లాగానే ఉండటం విశేషం. కే అందించిన సంగీతం ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చే లా కనిపిస్తుంది. విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 8వ తారీఖు న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories