యాత్ర సినిమా మొదటి రోజు కలెక్షన్లు

యాత్ర సినిమా మొదటి రోజు కలెక్షన్లు
x
Highlights

దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర'. మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో కనిపించిన ఈ...

దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర'. మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో కనిపించిన ఈ సినిమా కు మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ నిన్న అనగా ఫిబ్రవరి 8 వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ఓపెనింగ్ రోజు నుండి ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటన అద్భుతంగా ఉందని మహి వి రాఘవ్ వైయస్సార్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది అంటూ సినిమా చూసిన వారు చెబుతున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో 'యాత్ర' మంచి వసూళ్లను నమోదు చేసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం మొదటి రోజునే యాత్ర సినిమా 2.76 కోట్లు వసూలు చేసింది. ఇక ఎలాగో వీకెండ్ కాబట్టి కలెక్షన్ల హంగామా తగ్గేది లేదని ట్రేడ్ వర్గాల అంచనా. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈ సినిమా మంచి వసూళ్లను నమోదు చేసుకుంది. విజయ్ చిల్లా మరియు శశి దేవి రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా లో సుహాసిని, రావు రమేష్, అనసూయ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories