5 రోజుల్లో 'యాత్ర' షేర్ ఇంతేనా

5 రోజుల్లో యాత్ర షేర్ ఇంతేనా
x
Highlights

ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ హవా నడుస్తున్న సమయంలో తాజాగా తెరకెక్కిన సినిమా 'యాత్ర' ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ప్రజా నేత అయిన డాక్టర్...

ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ హవా నడుస్తున్న సమయంలో తాజాగా తెరకెక్కిన సినిమా 'యాత్ర' ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ప్రజా నేత అయిన డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా విడుదలైన ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ వైఎస్సార్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తారీఖు న విడుదలైంది. సినిమాలో మమ్ముట్టి నటన అద్భుతంగా ఉందని దర్శకుడి నెరేషన్ చాలా బావుంది అంటూ సినిమా మంచి వర్డ్ ఆఫ్ మౌత్ ని సంపాదించింది

కానీ కలెక్షన్ల రూపంలో మాత్రం అది కనిపించకపోవడం గమనార్హం. విడుదలైన 5 రోజుల్లో యాత్ర సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4.90 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 6.1 కోట్ల షేర్ ను నమోదు చేసుకుంది ఈ సినిమా. కానీ ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ 11.50 కోట్లకు జరిగింది. అంటే సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను దాటలేదు. యుఎస్ లో 8,837 డాలర్లను మాత్రమే వసూలు చేసిన 'యాత్ర' ఇప్పుడు డిజాస్టర్ గా మారేలా ఉంది. మరి ఏమవుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories