Yashika Aannand Accident: ప్రాణాపాయ స్థితిలో దేవరకొండ "నోటా" హీరోయిన్

Sandeep Reddy
Published on: 25 July 2021 1:44 PM IST
Yashika Aannand Severely Injured in Car Accident And Treatment in Chennai Private Hospital
X

యాశిక ఆనంద్ కారు ఆక్సిడెంట్ 

Yashika Aannand Car Accident: తమిళ పరిశ్రమలో "ధ్రువ పతినారు" సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన 21 ఏళ్ళ యాశిక ఆనంద్ ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా "నోటా" చిత్రంలో ఒక కీలక పాత్రలో కూడా నటించింది. తాజాగా ఈ యంగ్ హీరోయిన్ కార్ ఆక్సిడెంట్ కి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. యాశిక ఆనంద్ మరియు తన స్నేహితురాలు ఇద్దరు కారులో ప్రయాణిస్తుండగా మహాబలిపురం సమీపంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో శనివారం అర్థరాత్రి సమయంలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హైదరాబాద్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన తన స్నేహితురాలు వల్లిచెట్టి భవాని అక్కడికక్కడే మృతి చెందింది. ఇక ప్రస్తుతం చెన్నై లో ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న యాశిక ఆనంద్ పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉన్నట్లు డాక్టర్స్ చెబుతున్నారు.


ప్రమాదానికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో యాశిక ఆనంద్ మరియు తన స్నేహితురాలు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యాశిక ఆనంద్ ప్రమాదానికి గురైన సంగతి తెలుసుకున్న నటుడు దర్శకుడు ఎస్ జే సూర్య ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక అటు తెలుగు తమిళంలో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా మంచి ఆఫర్లు పొందే సమయానికి ఇలా జరగడంతో పలువురు సినీ ప్రముఖులు షాక్ కి గురి అయ్యారు. ఇక ఇప్పటికే రాజా భీమ, ఇవాన్ థాన్, కడమై యై సేయ్ వంటి తమిళ సినిమాలలో నటించడానికి ఒప్పుకుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story