Ravanaura: రవితేజ డైరెక్టర్ కి బ్రేక్ వచ్చినట్టేనా..?

Ravanaura: రవితేజ డైరెక్టర్ కి బ్రేక్ వచ్చినట్టేనా..?

Arun Chilukuri
Updated on: 27 Feb 2023 4:00 PM IST
Will Sudheer Varma Bounce Back With Ravi Teja Film
X

Ravanaura: రవితేజ డైరెక్టర్ కి బ్రేక్ వచ్చినట్టేనా..?

Sudheer Varma: క్రాక్ సినిమా తోనే సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదలైన మొదట్లో కొంచెం మిక్స్‌డ్‌ రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఆ తరువాత కలెక్షన్లు బాగానే ఉపందుకున్నాయి. శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్బులో కూడా చేరిపోయి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ కీలక పాత్ర పోషించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా 100 కోట్ల క్లబ్బులో చేరిపోయి వరుసగా రవితేజ కి రెండు మర్చిపోలేని బ్లాక్ బస్టర్లను ఇచ్చింది.

ఇక ఈసారి రవితేజ హ్యాట్రిక్ కొడితే బాగుంటుంది అని అభిమానులు రవితేజ తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో త్వరలో విడుదల కాబోతోంది "రావణాసుర" సినిమా. రవితేజ ఇంతకుముందు ఎన్నడూ కనిపించినటువంటి పూర్తి భిన్నమైన క్యారెక్టర్ లో నటిస్తున్న సినిమా ఇది. మర్డర్ మిస్టరీ యాక్షన్ త్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

అను ఇమ్మానుయేల్, మేఘ ఆకాష్, ఫరియ అబ్దుల్లా, దక్ష నగర్కర్, మరియు పూజిత పొన్నాడ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. స్వామి రారా సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన సుదీర్ వర్మ మొదటి సినిమాతోనే మంచి హిట్టు అందుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ రేంజ్ లో మరొక హిట్టును నమోదు చేసుకోలేకపోయారు. సుధీర్ వర్మ ఇప్పుడు తన ఆశలు అన్ని రావణాసుర పైనే పెట్టుకున్నారు. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడంతో చిత్ర బృందం సుధీర్ వర్మ పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న దర్శక నిర్మాతలు సినిమాని ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో సుధీర్ వర్మ ఎంత వరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story