నాగార్జున కోసం అనుష్క ఆ సినిమా సైన్ చేస్తుందా ?

నాగార్జున కోసం అనుష్క ఆ సినిమా సైన్ చేస్తుందా ?
x
Highlights

"దేవదాస్" సినిమా తరువాత అక్కినేని నాగార్జున ఇప్పటి వరకు తన తదుపరి సినిమాని స్టార్ట్ చేయలేదు. కానీ నాగార్జున మాత్రం తన తదుపరి సినిమా డైరెక్ట్ చేసే...

"దేవదాస్" సినిమా తరువాత అక్కినేని నాగార్జున ఇప్పటి వరకు తన తదుపరి సినిమాని స్టార్ట్ చేయలేదు. కానీ నాగార్జున మాత్రం తన తదుపరి సినిమా డైరెక్ట్ చేసే అవకాశాన్ని హీరో రాహుల్ రవీంద్రన్ కి ఇచ్చాడు. గత ఏడాది "చి.లా.సౌ" సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తోలి సినిమాతోనే డీసెంట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు రాహుల్. ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ అక్కినేని నాగార్జున తో "మన్మధుడు 2" ని తెరకేక్కిస్తున్నాడు. నాగార్జున కెరీర్లో "మన్మధుడు" సినిమా కి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ వస్తుంది అంటే అందరిలో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అనుష్క ని తీసుకోవాలి అనే ఆలోచనలో నాగార్జున ఉన్నాడు. అనుష్క తన తదుపరి సినిమా అయిన "సైలెన్స్" కోసం సన్న బడింది. అనుష్క సన్నబడిన విషయం తెలుసుకున్న నాగార్జున వెంటనే తన సినిమాలో అనుష్క ని మెయిన్ హీరోయిన్ గా తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు అంట. అసలు ఇండస్ట్రీ లో అనుష్క కి మొదట అవకాశం ఇచ్చిందే నాగార్జున. మరి ఆ విషయన్ని ద్రుష్టిలో ఉంచుకొని అనుష్క ఈ సినిమా సైన్ చేస్తుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఎంపికైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories