"ఆర్ఆర్ఆర్" బృందం కావాలనే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లను విడదీస్తోందా?

అందుకే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు విడివిడిగా ప్రమోషన్లు చేస్తున్నారా?

Arun Chilukuri
Updated on: 11 March 2023 10:01 PM IST
Why Ram Charan and NTR Making Separate RRR Oscar promotions
X

"ఆర్ఆర్ఆర్" బృందం కావాలనే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లను విడదీస్తోందా?

Oscar Promotions: నిన్న మొన్నటి దాకా "ఆర్ఆర్ఆర్" సినిమా ప్రమోషన్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసే కనిపించేవారు. విడుదలకి ముందు నుంచి ఇద్దరు కలిసి సినిమాకి సంబంధించిన ప్రతి ప్రమోషనల్ వీడియోలోనూ కనిపించారు. కానీ చూస్తూ ఉంటే ప్రస్తుతం పరిస్థితులు మారినట్లు అనిపిస్తోంది. ఆస్కార్ ప్రమోషన్ల కోసం ముందుగా రామ్ చరణ్ అమెరికా వెళ్లారు. కానీ తారకరత్న అకాల మరణంతో ఎన్టీఆర్ ఇండియాలోనే ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ మధ్యనే ఒక వారం క్రితం ఎన్టీఆర్ కూడా అమెరికా వెళ్లారు కానీ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లు కలిసి ఉన్న ఫోటోలు మాత్రం కనిపించటం లేదు. ఇద్దరూ ఇంటర్వ్యూ లతో బిజీగా ఉన్నప్పటికీ ఇద్దరూ వేరువేరుగా ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం కావాలనే ఇద్దరు హీరోల అభిమానులకి మధ్య గొడవలు జరగకుండా ఇద్దరు హీరోలను విడివిడిగా ప్రమోషన్లకు పంపిస్తున్నారని తెలుస్తోంది.

కానీ ఆస్కార్ అనేది చాలా పెద్ద విషయం. దానికి సంబంధించిన ప్రమోషన్లలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇలా విడివిడిగా ఇంటర్వ్యూలకు వెళ్లడం అభిమానులకు కూడా నచ్చటం లేదు. ఇద్దరు కలిసి ప్రమోషన్లకు వెళితే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక రేపు అనగా మార్చి 12వ తేదీన లాస్ ఏంజెల్స్ లో భారీ ఎత్తున ఆస్కార్ వేడుక జరగనుంది. ఇప్పటికే ఆస్కార్స్ లో నామినేట్ అయిన "నాటు నాటు" పాట కచ్చితంగా అవార్డును అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story