Pawan Kalyan Skipped Niharika's Engagement : ఆ కారణంగానే నిహారిక నిశ్చితార్ధానికి పవన్ రాలేదట?

Pawan Kalyan Skipped Niharika’s Engagement : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, మెగా ప్రిన్సెస్ నిహారిక నిశ్చితార్ధం

Krishna
Published on: 14 Aug 2020 2:03 PM IST
Pawan Kalyan Skipped Niharikas Engagement : ఆ కారణంగానే నిహారిక నిశ్చితార్ధానికి పవన్ రాలేదట?
X
Pawan Kalyan (File Photo)

Pawan Kalyan Skipped Niharika's Engagement : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, మెగా ప్రిన్సెస్ నిహారిక నిశ్చితార్ధం నిన్న ఆగస్టు 13 (గురువారం) సాయింత్రం జరిగింది. కరోనా నేపద్యంలో జరుగుతున్న వేడుక కావడంతో కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత భాగమయ్యారు.. నిహారిక నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ వేడుకకి నిహారిక బాబాయ్ పవన్ కళ్యాణ్ హాజరుకాలేదు.. దీనితో అభిమానుల్లో వేర్వేరు ఊహగానాలు, అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేక దీక్షలో ఉన్నాడని, ఈ దీక్ష నిబంధనల ప్రకారం సాయింత్రం ఆరు గంటల తర్వాత బయటకు వెళ్లొద్దని సన్నిహితుల సమాచారం.. దీనితో ఉదయం సమయంలో పవన్ కళ్యాణ్ నాగబాబు ఇంటికి వెళ్లి నిహారికను ఆశీర్వదించారని సమాచారం..

అటు అభిమానులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు నిహారికకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నిహారిక- చైతన్య జంట చాలా బాగుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక నిహారికకి కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డ ఎవరో కాదు.. గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు తన్య ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. వచ్చే ఏడాది నిహారిక వివాహం జరగనుందని సమాచారం..

Krishna

Krishna

Next Story