Niharika konidela engagement: మెగా వారింట్లో మొదలైన పెళ్ళిసందడి..సింపుల్ గా నిహారిక నిశ్చితార్థం!

Niharika konidela engagement: మెగా డాటర్ నిహారిక వివాహ నిశ్చితార్థం ఈరోజు హైదరాబాద్ లో నిరాడంబరంగా జరిగింది.

K V D Varma
Updated on: 13 Aug 2020 9:15 PM IST
Niharika kOnidala engagement  today
X
Mega daughter Niharika engagement

మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ విశేషం అయినా అభిమానులకు పండగే. సినిమా కావచ్చు.. ఇంట్లో జరిగే వేడుక కావచ్చు. ఒక్క చిరంజీవికి సంబంధించినదే కాదు ఆయన తమ్ముళ్లు.. సోదరీమణులు..వారి పిల్లలు వీరందరి ప్రతి కదలిక.. వారికి సంబంధించిన ప్రతి ముఖయ్ సంఘటన అభిమానులు తమ ఇంట్లో జరిగే సంబరంగా భావిస్తారనడంలో సందేహం లేదు. ఇక చిరంజీవి తమ్ముడు.. నటుడు.. నాగబాబు కుమార్తె నీహారిక కు కూడా మెగాస్టార్ అభిమానులే కాకుండా ప్రత్యేకమైన అభిమానులున్నారు టీవీ షోలలో తనదైన ముద్రతో ఒక ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు నిహారిక.

ఇప్పుడు నీహారిక పెళ్లికూతురయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.. గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు చైత‌న్య జొన్నల‌గ‌డ్డతో నిహారిక వివాహం జరగనుంది. ఇప్పటికే తన ప్రియుడిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది నిహారిక.. వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఈరోజు నీహారిక వివాహ నిశ్చితార్థం చాలా కొద్దీ మంది కుటుంబఅతిథుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ ఇంకా అతి కొద్దీ మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కోవిద్ నిబంధనల నేపథ్యంలో చాలా గోప్యంగా ఈ వేడుకను నిర్వహించారు.

గతంలోనే నాగబాబు నిహారిక పెళ్ళి విష్యంలో క్లారిటీ ఇచ్చారు. పెళ్లి ఫిబ్రవరిలో ఉండొచ్చని అయన చెప్పారు. ఇక మెగా వారింట్లో పెళ్లి సందడి మొదలైనట్టే!

K V D Varma

K V D Varma

Next Story