Bapu Bommaki Pellanta Teaser : బా‌పు బొమ్మకు పెళ్లంట.. వైరల్ అవుతున్న నిహారిక వీడియో!

Bapu Bommaki Pellanta Teaser : దగ్గుబాటి వారి ఇంట్లో తాజాగా పెళ్లి సందడి ముగిసింది.. ఇక మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్

Krishna
Published on: 13 Aug 2020 6:04 PM IST
Bapu Bommaki Pellanta Teaser : బా‌పు బొమ్మకు పెళ్లంట.. వైరల్ అవుతున్న నిహారిక వీడియో!
X
Niharika kondela

Bapu Bommaki Pellanta Teaser : దగ్గుబాటి వారి ఇంట్లో తాజాగా పెళ్లి సందడి ముగిసింది.. ఇక మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.. గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు చైత‌న్య జొన్నల‌గ‌డ్డతో నిహారిక వివాహం జరగనుంది. ఇప్పటికే తన ప్రియుడిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది నిహారిక.. వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఓ షోలో నిహారిక పెళ్లి కూతురుగా ముస్తాబై తెగ సందడి చేసింది. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్రముఖ ఛానల్ లో "బా‌పు బొమ్మకు పెళ్లంట" అనే ఓ ప్రత్యేక కార్యక్రమం రాబోతోంది. దీనికి నిహారిక తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు జడ్జీగా వ్యవహరించనున్నారు. ఈ షోకి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పల్లకిలో పెళ్లి కూతరు నిహారికను తీసుకురావడం, బ్యాక్‌గ్రౌండ్‌లో ''వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ'' అంటూ పాట రావడం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి..

ఈ షోకి తన భ‌ర్తతో క‌లిసి విచ్చేసిన‌ యాంక‌ర్ అన‌సూయ నిహారికని విష్ చేసింది. ఇక ఇదంతా చూస్తున్న నాగబాబు మురిసిపోతూ తన ఫోన్లో వీడియోని తీసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్‌తో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్ బాబా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇక త్వరలో నిహారిక నిశ్చితార్థం జరుగుతుందని తెలుస్తోంది.

ఇక మెగా కాంపౌండ్ నుండి తొలి హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక‌.. ఒక మ‌న‌సు,హ్యాపీ వెడ్డింగ్‌, సూర్యకాంతం, సైరా వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని సమాచారం.



Krishna

Krishna

Next Story