బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళేది అతనేనా?

బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళేది అతనేనా?
x
Highlights

వారాంతం లో బిగ్ బాస్ హంగామా వేరుగా ఉంటుంది. వారం రోజుల పాటు హౌస్ లో జరిగిన విశేషాలన్నిటి పై విశ్లేషణ చేసి.. వచ్చే వారానికి హౌస్ మేట్స్ అందరూ హుషారుగా...

వారాంతం లో బిగ్ బాస్ హంగామా వేరుగా ఉంటుంది. వారం రోజుల పాటు హౌస్ లో జరిగిన విశేషాలన్నిటి పై విశ్లేషణ చేసి.. వచ్చే వారానికి హౌస్ మేట్స్ అందరూ హుషారుగా ఉండేలా చేసే ఎపిసోడ్ లు ప్రసారం అవుతాయి. హోస్ట్ హౌస్ మేట్స్ కి కనిపించేది ఈ రెండు రోజులే. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళిపోతారనేది తేలే రోజు ఆదివారం. వారం పాటు ఎలిమినేషన్స్ నామినీలుగా ఉండి.. హౌస్ లోంచి బయటకు వెళ్ళేది ఎవరా అనే టెన్షన్ లో హౌస్ మేట్స్ తో పాటు బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా ఉంటారు.

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రారంభమయి వారం అయిపొయింది. గొడవలు.. అలకలు.. నామినేషన్లు.. టెన్షన్లు.. వినోదం వీటన్నిటితో మొదటి వారం ముగిసింది. శనివారం హోస్ట్ నాగార్జున వచ్చారు. వచ్చిన వెంటనే సరదాగా మొదలు పెట్టి అందరినీ పలకరించారు. హౌస్ మేట్స్ అందర్నీ వారి పొరపాట్లు.. వారి ఇబ్బందులు.. చెప్పమని, వారికి సూచనలు ఇస్తూ.. నడిపించారు. ఇక నామినేషన్ లో ఉన్నవారిలో ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారో ప్రకటించారు. మొత్తం ఆరుగురు రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమ ఎలిమినేషన్స్ కి నామినేషన్ లో ఉండగా వారిలో హిమజ, పునర్నవి సేఫ్ జోన్ లో ఉన్నారని నాగార్జున ప్రకటించారు. ఇక వితిక, రాహుల్, జాఫర్, హేమ నామినేషన్స్ లో ఉన్నారు. ఈరోజు ఈ నలుగురు లో ఎవరు హౌస్ లోంచి బయటకు వెళ్ళిపోతారన్నది తేలిపోతుంది.

ఈరోజు ఎవరు ఎలిమినేషన్ అవుతారన్న దానిపై పలు చర్చలు నడుస్తున్నాయి. ఒక లెక్క ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో దాదాపు క్లారిటీ వచ్చింది. సేఫ్ జోన్ లో ఎవరు ఎందుకు ఉంటారన్నది విశ్లేషిస్తే..

వితిక.. కచ్చితంగా సేఫ్ జోన్ లో ఉండే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే.. మొదటిసారి ఓ జంటను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. మొదటి వారంలోనే ఆమెను బయటకు పంపిస్తే బిగ్ బాస్ టార్గెట్ పూర్తికాదు. పైగా భార్యాభర్తలుగా వితిక, వరుణ్ సందేశ్ ల నుంచి కొంత ప్రత్యేకమైన ఎంటర్టైన్ మెంట్ హౌస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బిగ్ బాస్ అనేది ఓ సినిమా అనుకుంటే అందులో అఫీషియల్ గా రొమాన్స్ చూపించే అవకాశం వారిద్దరికే ఉంటుంది. అది కూడా హౌస్ కి ముఖాయమే కదా. ఈ లెక్కలో కచ్చితంగా వితిక బయటకు ఈ వారం అయితే వెళ్లదు అని చెప్పుకోవచ్చు. అదీకాకుండా మహేష్ తో గొడవలో.. నువ్వు నన్ను క్షమించమని ఊరికే అడగొద్దు.. బయటకు వెళ్లిన తరువాత జరిగిన విషయంలో వీడియోలు చూసుకుని.. నీ తప్పు ఉందని నమ్మితేనే సారీ చెప్పు అంటూ ఆమె అన్న మాటలు కూడా కొంతవరకూ ఆమె సేఫ్ జోన్ లోకి వెళుతుందని చెప్పడానికి కారణంగా చెప్పొచ్చు.

తరువాత జాఫర్.. ఈ వారం రోజుల్లో జాఫర్ వలన వచ్చిన ఇబ్బందికర వాతావరణం ఏదీ హౌస్ లో లేదు. పైగా బాబా భాస్కర్ తో కల్సి చక్కని వినోదాన్ని పంచుతున్నారు. తనదైన శైలిలో అందర్నీ కలుపుకుంటూ పోతున్నారు. సో, జాఫర్ ని బయటకు పంపించే కారణాలు అసలు కనిపించడం లేదు.

ఇక మిగిలింది హేమ.. రాహుల్! ఎలిమినేషన్స్ కి పోటీ వీరిద్దరి మధ్యే ఉంది. హౌస్ లో మొదటి గొడవ మొదలైంది వీరిద్దరి మధ్యే. అయితే, హేమ విషయంలో కూడా తనని హౌస్ లో కొనసాగించడానికి ప్రత్యేక కారణం ఉంది. ఎందుకంటే, ఫైర్ బ్రాండ్ ఒక్కరన్నా హౌస్ లో ఉండాలి. అప్పుడే అక్కడ మజా వస్తుంది. హేమను ఇప్పుడే పంపిస్తే ఆ మజా ప్రేక్షకులకి దూరం అయిపోతుంది. సో, ఆమెను బయటకు పంపిస్తారని అనుకోలేం. ఇక మిగిలింది రాహుల్.. ఇతను హౌస్ లోకి వెళ్ళినప్పటినుంచి కొంత వ్యవహారం తేడాగానే కనిపించింది. ముఖ్యంగా హేమతో వంటింటి గొడవలో చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యాడు. ఇది అతనికి పెద్ద ప్రతీకూలాంశం. రాహుల్ కచ్చితంగా ఎలిమినేటి అవుతాడని చెప్పడానికి మరో రీజన్ శనివారం నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడిన విధానం. అందులో అందర్నీ చాలా విధాలుగా ప్రశ్నించారు కానీ, రాహుల్ ను ఎక్కువగా ప్రశ్నించలేదు. ఇదీ అనే ప్రత్యేక సూచనలు ఏమీ చేయలేదు. ఇదే సందర్భంలో హేమకు వచ్చినవెంటనే పెద్దరికం చూపించాలనుకున్నావు. నామినేషన్ లోకి వెళ్ళిపోయావు అంటూ నాగార్జున మాట్లాడిన మాటలు కూడా లెక్కలోకి తీసుకుంటే దాదాపుగా రాహుల్ బయటకు వెళ్లడం ఖాయమని అనిపిస్తోంది.

చివరగా...

కత్తి మహేష్.. సినిమా విమర్శకుడిగా పరిచయమైనా ఈయన బిగ్ బాస్ 2 తో పాప్యులర్ అయిపోయారు. ఈయన హౌస్ లోకి ఎవరు వెళతారని విషయం ఒకరోజు ముందుగానే చెప్పారు. ఆయన చెప్పిన 15 మందే హౌస్ లోకి వెళ్లారు. ఇప్పుడు ఆయన కూడా రాహుల్ ఈవారం బయటకు వెళ్లిపోతాడు అని చెబుతున్నారు. ఇన్ని అంశాలు కల్సి వస్తున్నాయి కాబట్టి రాహుల్ ఎలిమినేషన్ ఖాయం అనే అంచనాలు వస్తున్నాయి. ఇక ఓటింగ్ విషయం గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదు. మొదనుంచీ బిగ్ బాస్ ఓటింగ్ విధానంపై పెద్దగా ఎవరికీ నమ్మకాలు లేవు. ఇప్పడు అదే జరుగుతుంది. అయితే, ఓటింగ్ కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటే ఈ లెక్కలనీ మారిపోతాయి. హేమ గానీ, వితికా గానీ బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు హేమ కచ్చితంగా బయటకు వెళ్ళేచాన్స్ ఎక్కువ. ఇప్పటి వరకూ అయితే రాహుల్ కథ ఇంటికే అనేది అందరి అంచనా.. విషయం తేలడానికి మరి కొన్ని గంటలు వేచి ఉండక తప్పదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories