logo
సినిమా

ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న రత్తాలు

ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న రత్తాలు
X
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో తోబా తోబా పాట మరియు చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150'...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో తోబా తోబా పాట మరియు చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో రత్తాలు రత్తాలు పాటలకు స్టెప్పులేసిన చేసిన హాట్ బ్యూటీ రాయి లక్ష్మి ఇప్పుడు 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' అనే సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

ఇక ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ను రేపు అనగా 19 వ తారీఖు న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ట్రైలర్ తో ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. రామ్ కార్తీక్, ప్రవీణ్, మధునందన్ మరియు జబర్దస్త్ మహేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఏబీటీ క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి ఆర్కె రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Next Story