వచ్చే రెండు సంక్రాంతి పండుగలకు దిల్ రాజు హడావిడి

Ruthvik
Published on: 1 Feb 2019 11:12 AM IST
వచ్చే రెండు సంక్రాంతి పండుగలకు దిల్ రాజు హడావిడి
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు ఆయనకున్న సంక్రాంతి సెంటిమెంట్ గురించి అందరికీ తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో సంక్రాంతికి విడుదలైన సినిమాలు చాలా వరకు బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. 2013లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 2014లో 'ఎవడు' 2017 లో 'శతమానం భవతి' సినిమాలు సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇక ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు నిర్మాణంలో విడుదలైన 'ఎఫ్ 2' సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

ఇక అప్పుడే తరువాతి సంవత్సరాల సంక్రాంతి విడుదలలను లైన్ లో పెట్టేసాడు దిల్ రాజు. వచ్చే ఏడాది అంటే 2020లో సంక్రాంతికి 'పలుకే బంగారం సినిమా' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దిల్ రాజు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దిల్ రాజు తమ్ముడు శిరీష్ కుమారుడైన ఆశిష్ రెడ్డి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అప్పుడే 'ఎఫ్ 2' సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3' సినిమా 2021 సంక్రాంతికి విడుదల కానుంది. చూస్తుంటే మరొక రెండేళ్ల పాటు కూడా సంక్రాంతి కి దిల్ రాజు హంగామా ఎక్కువ కనిపించేటట్టు ఉంది.

Ruthvik

Ruthvik

Next Story