Warina Hussain: సోషల్ మీడియాకు టాప్ హీరోయిన్ గుడ్‌బై.. ఆందోళనలో ఫ్యాన్స్

Warina Hussain: ఈమె ఇక నుంచి సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుందట.

Samba Siva Rao
Updated on: 26 April 2021 1:33 PM IST
Warina Hussain Bollywood Actress
X

Warina Hussain instagram photos

Warina Hussain: బాలీవుడ్ హీరోయిన్‌ వరీనా హుస్సేన్‌ ఫ్యాన్స్‌కు గుండెబద్దలయ్యే వార్త చెప్పింది. వరీనా హుస్సేన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈమె ఇక నుంచి సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుందట. వరీనా హుస్సేన్‌ తన సోషల్ మీడియాలో స్వయంగా ప్రటించింది. ఈ మేరకు ఆమె అఖరి పోస్ట్ చేసింది. "నిజానికి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని విన్నాను. కానీ నా ఫ్యాన్స్‌ ప్రేమాభిమానాలే నా బలం.. కాబట్టి దీన్ని తప్పకుండా షేర్‌ చేసుకోవాల్సిందే. సోషల్‌ మీడియాలో ఇదే నా ఆఖరి పోస్ట్‌.. ఇక మీదట నా సినిమా అప్‌డేట్‌లను టీమ్‌ దగ్గరుండి చూసుకుంటుంది. వారే అన్ని ఖాతాలను డీల్‌ చేస్తారు" అని రాసుకొచ్చింది.

వరీనా హుస్సేన్‌ సోషల్‌ మీడియాకు బై చెప్పడంతో వరీనా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎందుకు వెళ్లిపోతున్నారు?, మీరు లేకుండా ఆన్‌లైన్‌లో ఉండలేం? అంటూ అభిమానులు ఎమోషనల్‌ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవల బాలీవుడ్ టాప్ హీరో అమీర్‌ఖాన్‌ కూడా సోషల్‌ మీడియా నుంచి తాత్కాలికంగా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇలా బాలావుడ్ తారలంతా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఆమె 'పోస్టర్‌', 'ఇన్‌కంప్లీట్‌ మ్యాన్‌' సినిమాల్లో నటిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ 'దబాంగ్‌ 3' సినిమాలో వరీనా ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఆ చిత్రంతో వరీనాకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. టాలీవుడ్ లో కూడా వరీనా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ వరీనా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాట్లు గుసగసలు వినిపిస్తున్నాయి.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story