సూపర్ హిట్ అయితే నిద్రలేపండి.. గ్యాంగ్ లీడర్ నానీ!

సూపర్ హిట్ అయితే నిద్రలేపండి.. గ్యాంగ్ లీడర్ నానీ!
x
Highlights

తన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్ విడుదల సందర్భంగా నేచురల్ స్టార్ నానీ సినిమా హిత్తయితేనే లేపండి.. లేకపోతే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటూ ట్వీట్ చేసారు.

తన తాజా సినిమా గ్యాంగ్ లీడర్ విడుదల సందర్భంగా నేచురల్ స్టార్ నానీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సినిమా సూపర్ హిట్ అయితే లేపండి లేకపోతే డిస్టర్బ్ చేయకండి అంటూ అయన ట్వీట్ చేశారు. సినిమాలో సీనియర్ నటి లక్ష్మి భుజాల మీద తలవాల్చి పడుకున్నట్టు ఉన్న స్టిల్ ఆ ట్వీట్ కు జత చేశారు. అంతే కాదు ఈ గ్యాంగ్ లీడర్ మీ అందరి కోసం.. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను -మీ పెన్సిల్ పార్థసారధి అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ అందరిలోనూ ఆసక్తి రేపింది.

నాచురల్ స్టార్ నానీ.. టాలీవుడ్ లో స్పీడ్ ఉన్న హీరో. సంవత్సరంలో రెండు సినిమాలు కచ్చితంగా వచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు. ఈ సంవత్సరం ఇప్పటికే 'జెర్సీ' వేసుకుని వచ్చి అందర్నీ మెప్పించిన నానీ ఈసారి గ్యాంగ్ లీడర్ ను అంటూ ఈరోజు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఇక నానీ సినిమాలు అంటే వినోదం మినిమం గ్యారంటీ అని అన్ని వర్గాల ప్రేక్షకులు నమ్ముతారు. ఇక గ్యాంగ్ లీడర్ సినిమాకి దర్శకుడు విక్రం. మనం సినిమాతో డీసెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్లాస్ డైరెక్టర్. నానీ, విక్రం కాంబినేషన్ అంటే సినిమా కచ్చితంగా కొత్తదనంతో ఉంటుంది. పాత పేరుతో కొత్తదనాన్ని అందిస్తారని ప్రేక్షకులతో పాటూ ఇండస్ట్రీ కూడా భావిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories