HIT Movie Review: థ్రిల్లర్ జోనర్ లో మంచి ప్రయత్నం!

HIT Movie Review: థ్రిల్లర్ జోనర్ లో మంచి ప్రయత్నం!
x
Highlights

నాచురల్ స్టార్ నానీ ఓ సినిమా నిర్మిస్తున్నాడంటే అది కచ్చితంగా చెప్పుకోదగ్గ సినిమా అయివుంటుందని అందరూ భావిస్తారు. అదేవిధంగా మొదటి సినిమా ఫలక్ నుమా దాస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా అంటే మరికొంత ఆసక్తి కలుగుతుంది.

మూవీ: హిట్

నటీనటులు: విశ్వక్ సేన్, రుహాని శర్మ తదితరులు

నిర్మాత: నాని

దర్శకత్వం: శైలేష్ కొలను

సంగీతం: వివేక్ సాగర్

థ్రిల్లర్ జోనర్ లో మంచి ప్రయత్నం!

నాచురల్ స్టార్ నానీ ఓ సినిమా నిర్మిస్తున్నాడంటే అది కచ్చితంగా చెప్పుకోదగ్గ సినిమా అయివుంటుందని అందరూ భావిస్తారు. అదేవిధంగా మొదటి సినిమా ఫలక్ నుమా దాస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా అంటే మరికొంత ఆసక్తి కలుగుతుంది. నానీ నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా హిట్. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో రూపొందించారు. ట్రైలర్..ప్రీ రిలీజ్ వేడుకలతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరి సినిమా ఎలా వుంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా అనేది తెల్సుకుందాం.

ఇదీ కథ:

విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్) ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతుంటాడు. క్లిష్టమైన కేసును పరిష్కరించిన విక్రం కు ఒక మిస్టరీ కేసు ఎదురవుతుంది. అది కూడా డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ తప్పిదం వలన జరిగిన కిడ్నాప్ కేస్. సిఐ (మురళీ శర్మ) అజాగ్రత్త వల్ల ప్రీతి అనే కిడ్నాప్ అవుతుంది. ఈ కేసును చేదించే క్రమంలో ఉండగానే నేహా (రుహాని శర్మ) అనే ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ కూడా కిడ్నాప్ అవుతుంది. ఈ రెండు కేసులకు ఒక కామన్ లింక్ ఉందని అనుమానించిన విక్రం అదే కోణంలో దర్యాప్తు చేస్తుంటాడు. అయితే, తనకున్న ఒత్తిడి వ్యాధి కారణంగా విక్రం ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపిస్తుంది. దీంతో అభిలాష్ అనే ఆఫీసర్ ఈ కేసులో విక్రమ్ ను అనుమానిస్తాడు. ఇప్పుడు ఈ కేసు ఎలా పరిష్కారం అయింది? అసలు విక్రం ఒత్తిడికి ఎందుకు లోనవుతుంటాడు? మిస్సింగ్ మిస్టరీలను అతను సాల్వ్ చేశాడా? అభిలాష్ అనుమానం ఎలా తీరింది? ఈ ప్రశ్నలన్నిటి సమాధానమే హిట్ సినిమా!

ఎవరెలా చేశారంటే..

విశ్వక్ సేన్ ఈ సినిమాలో తన నటనతో మరోసారి మెప్పించాడు. ఒకవైపు మెంటల్ స్ట్రెస్ తో బాధపడుతూనే మరోవైపు తన ప్రేమికురాలు కిడ్నాప్ ను చేధించే రోల్ లో విభిన్న షెడ్లలో విశ్వక్ సేన్ చక్కగా చేశాడు. ఇక ఈ సినిమా అంతా విశ్వక్ చుట్టూనే తిరుగుతుంది. మిగిలిన పాత్రలన్నీ సమయానుసారంగా వచ్చీ పోతుంటాయి. కొద్దిగా రుహాని శర్మ రోల్.. ఆమెతో విశ్వక్ సేన్ లవ్ ట్రాక్ బాగుంది. బ్రహ్మాజీ, భాను చందర్, మురళీ శర్మ, హరితేజ ఉన్నంతలో మెప్పించారు.

ఎలా ఉందంటే..

సినిమా మొదటి అర్థ భాగం పాత్రల పరిచయం.. కథా నేపధ్యంతో సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో సినిమా థ్రిల్లింగ్ గా సాగుతుంది. కొద్దిగా క్లైమాక్స్ వీక్ గా అనిపించినా..థ్రిల్లర్ జోనర్ లో మంచి ప్రయత్నంగా ఈ సినిమాని చెప్పొచ్చు. ఇక ఒక థ్రిల్లర్ సినిమాకి ట్విస్ట్ లు చాలా ముఖ్యం. ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ లు ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి.

శైలేష్ కొలను ఈ సినిమా దర్శకుడు. కథ కూడా అయన రాసిందే. కథను తాననుకున్నట్టు నడిపించడంలో శైలేష్ విజయవంతం అయ్యాడు. కథలో ఉన్న మంచి పాయింట్ ను బాగానే ఎలివేట్ చేయగలిగాడు. అయితే, ఇంకా ఈ కథకు చక్కని ఎమోషనల్ టచ్ ఇవ్వవచ్చు. కానీ, ఆ దిశలో పెద్దగా ప్రయత్నం చేయలేదు. ఇటువంటి సినిమాలకు కథనం చాలా ముఖ్యం ఈ విషయంలో శైలేష్ చక్కని కథనంతో గ్రిప్పింగ్ గా సినిమా నడిపించాడు. శైలేష్ దర్శకత్వ ప్రతిభతో సినిమాను చక్కగా నడిపించాడు. సినిమా లో మణికందన్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. ముఖ్యంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అవసరమైన విజువల్స్ ను అందించడంలో విజయవంతమయ్యాడు. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మెప్పించాడు. ఎడిటింగ్ స్మూత్ గా ఉంది. థ్రిల్లర్ కు కావాల్సిన రేసీ స్పీడ్ చిత్రానికి ఉండేలా ఎడిటింగ్ ఉంది.

మొత్తమ్మీద నానీ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సినిమా మొత్తం చూశాక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతున్దండంలో సందేహం లేదు.

ఈ విశ్లేషణ పూర్తిగా విశ్లేషకుడి అభిప్రాయం. దీనిలో వెలుబుచ్చిన అభిప్రాయాలు విశ్లేషకుడి కోణంలో వెల్లడించినవి. ఇవి సినిమా పై ప్రేక్షకుల అభిప్రాయలు కావని గమనించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories