Paagal Teaser: విశ్వక్ సేన్ 'పాగల్' టీజర్..ఆ హీరో‌ మూవీతో పోలుస్తున్న నెటిజన్లు

యవ కథానాయకుడు విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పాగల్'.

Samba Siva Rao
Published on: 18 Feb 2021 4:00 PM IST
Vishwak Sen Pagal  Movie Teaser
X

 విశ్వక్ సేన్ పాగల్ లుక్ 

యవ కథానాయకుడు విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పాగల్'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ గురువారం విడుదల చేశారు. విశ్వక్ సేన్ తన గత చిత్రాలను భిన్నంగా ఈ సినిమా ఉన్నట్లు టీజర్ లో చూపించారు. 'ఈ నగరానికి ఏమైంది', 'ఫ‌ల‌క్ నామా దాస్', హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు విశ్వక్.

విశ్వక్ సేన్ పాగల్ చిత్రం చూస్తే పూర్తిగా గేర్ మార్చినట్లు అర్థమవుతోంది. 'పాగల్' అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. సినిమా టీజర్ రిలీజ్ చేశారు. దాదాపు నిమిషం నిడివితో కూడిన ఈ టీజర్‌లో విశ్వక్ సేన్ కాస్త కొత్తగా దర్శనమిచ్చాడు.

ఈ టీజర్ లో విశ్వక్ సేన్ పలికిన మాటలు హైలెట్ గా నిలిచాయి. 'రేయ్.. ఎవ‌డ్రా.. నా ల‌వ‌ర్‌ని ఏడిపించింది' అంటూ తనలో మరో కోణాన్ని బయటపెట్టాడు విశ్వక్ సేన్. ప్రేమ కోసం పరితపించే లవర్ బాయ్ లా ఆకట్టుకున్నాడు. స్టైలిష్ యాటిట్యూడ్‌తో విశ్వక్ కనబర్చిన హావభావాలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరోవైపు విశ్వక్ సేన్ హేయిర్ స్టైల్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో ఉందని కొందరూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్ ఎన్టీఆర్ అభిమాని అంటూ మరో నెటిజన్ కామెంట్స్ పెట్టాడు.

ఈ సినిమా విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ పాగల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏప్రిల్ 30వ తేదీన పాగల్ చిత్రాన్నిరిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ సంగీతం సమకూర్చారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story