logo
సినిమా

పాటతో మన ముందుకు రానున్న ఫలక్నుమా దాస్

పాటతో మన ముందుకు రానున్న ఫలక్నుమా దాస్
X
Highlights

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా తో పాపులర్ అయిన యువ హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు...

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా తో పాపులర్ అయిన యువ హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు దర్శకుడి అవతారం ఎత్తనున్నాడు. త్వరలో 'ఫలక్నుమా దాస్' అనే సినిమా లో హీరోగా మాత్రమే కాక దర్శకుడు కూడా విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా మలయాళంలో ఆంటోనీ వర్గీస్ హీరోగా నటించిన 'అంగమలి డైరీస్' సినిమా రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ మధ్యనే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

తాజా సమాచారం ప్రకారం 'ఫలక్నుమా దాస్' సినిమా లోని ఒక పాటను ఈనెల 22వ తేదీన విడుదల చేయనున్నారు. గ్యాంగ్స్టర్ బాక్ డ్రాప్ తో క్రైమ్ డ్రామా గా 'ఫలక్నుమా దాస్' తెరకెక్కుతున్న ఈ సినిమాలో హర్షిత గౌర్, సలోని మిశ్రా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కు వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి విశ్వక్ దర్శకుడిగా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తాడో వేచి చూడాలి. ఈ సినిమా వేసవి లో విడుదల కానుంది.

Next Story