'వినయ విధేయ రామ' క్లోజింగ్ కలెక్షన్స్

వినయ విధేయ రామ క్లోజింగ్ కలెక్షన్స్
x
Highlights

రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే....

రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 92 కోట్ల కు అమ్ముడవ్వగా, సినిమా మాత్రం ఫుల్ రన్ లో రూ.62.64 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ మాత్రమే రాబట్టగలిగింది. అంటే ముప్పై కోట్ల నష్టాలతో ఈ సినిమా డిజాస్టర్ గా మారింది.

ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. పైగా హాలిడే సీజన్ కాబట్టి ఈ మాత్రమైన వసూళ్లను సాధించింది. కానీ మిగతా ఏరియాలతో పోల్చి చూస్తే ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సినిమా నైజామ్, ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దిల్ రాజు రూ.32 కోట్లకు కొనుకున్నారు. కానీ సినిమాతో రూ.11 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. తెలుగు రాష్ట్రాల పరిస్థితి పక్కన పెడితే ఓవర్సీస్ లో ఈ సినిమా ఇంకా పెద్ద డిజాస్టర్ గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా 'వినయ విధేయ రామ' క్లోజింగ్ కలెక్షన్స్:

నైజామ్: 12.58 కోట్లు

సీడెడ్: 11.92 కోట్లు

ఉత్తరాంధ్ర: 8.51 కోట్లు

కృష్ణ: 3.69 కోట్లు

గుంటూరు: 6.36 కోట్లు

ఈస్ట్ : 5.42 కోట్లు

వెస్ట్: 4.42 కోట్లు

నెల్లూరు: 2.89 కోట్లు

ఎపీ + తెలంగాణ: రూ. 55.79 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: 5.40 కోట్లు

ఓవర్సీస్: 1.45 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా: రూ. 62.64 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories