నష్టపరిహారం ఇవ్వనున్న స్టార్ ప్రొడ్యూసర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మధ్యనే తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా 'వినయ విధేయ రామ'.

Ruthvik
Published on: 24 Jan 2019 8:28 AM IST
నష్టపరిహారం ఇవ్వనున్న స్టార్ ప్రొడ్యూసర్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మధ్యనే తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా 'వినయ విధేయ రామ'. కియార అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 10వ తారీఖు న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఓపెనింగ్ రోజునే మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లు రాబట్టినప్పటికి ఓవర్సీస్ లో మాత్రం దారుణంగా ఫెయిలైంది.

నిజానికి 'రంగస్థలం' బ్లాక్ బస్టర్ అవ్వడంతో 'వినయ విధేయ రామా' సినిమాకు ఓవర్సీస్ లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ విడుదలైన తర్వాత మాత్రం అంచనాలు తలకిందుల అవడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి కష్ట సమయంలో ఈ చిత్ర నిర్మాత డివివి దానయ్య ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు 50 లక్షల వరకు తిరిగి వెనక్కి ఇచ్చేశారని, మిగతా బయర్లతో కూడా చర్చలు జరుపుతున్నారని వారికి కూడా నష్టపరిహారాన్ని చెల్లించనున్నారని తెలుస్తోంది.

Ruthvik

Ruthvik

Next Story