Vikram Injured: తంగలాన్ షూటింగ్ లో ప్రమాదం.. విక్రమ్ కు విరిగిన పక్కటెముక

Vikram: సినిమాలోని తన పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా సరే సెకండ్ థాట్ లేకుండా చేసేందుకు ఇష్టపడే విక్రమ్ తాజాగా తంగలాన్ చిత్రంలో నటిస్తున్నాడు.

Dhatripriya
Updated on: 3 May 2023 4:58 PM IST
Vikrams Rib Was Broken In Shooting Of Tangalan Movie
X

Vikram: తంగలాన్ షూటింగ్ లో ప్రమాదం..విక్రమ్ కు విరిగిన పక్కటెముక

Vikram: మన ఇండియన్ స్క్రీన్ కి దొరికిన ఆణిముత్యం చియాన్ విక్రమ్. సినిమాలోని తన పాత్ర కోసం ఎంత దూరానికైనా వెళ్లాడు. ఎంత కష్టాన్నైనా భరిస్తాడు. ఇందుకు ఐ సినిమానే నిలువెత్తు నిదర్శనం..ఈ సినిమా కోసం విక్రమ్ తన ప్రాణాలనే పణ్ణంగా పెట్టాడు. సినిమాలోని తన పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా సరే సెకండ్ థాట్ లేకుండా చేసేందుకు ఇష్టపడే విక్రమ్ తాజాగా తంగలాన్ చిత్రంలో నటిస్తున్నాడు.

కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్ మూవీ కోసం విక్రమ్ తననుతాను మరోసారి పూర్తిగా మార్చుకున్నాడు. తంగలాన్ టీజర్ ను చూస్తే మనం చూస్తున్న హీరో విక్రమేనా అనిపించేలా మేక్ ఓవర్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ లో చియాన్ తీవ్రంగా గాయపడ్డాడు. పిరియాడిక్ ఎంటర్ టైనర్ గా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న తంగలాన్ కోసం రిహార్సల్ చేస్తుండగా విక్రమ్ గాయపడ్డాడు. ఆయన పక్కటెముక విరిగిపోవడంతో వెంటనే హాస్పటల్ లో చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

విక్రమ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. పొన్నియెన్ సెల్వన్ 2 విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న తరుణంలో తమ అభిమాన హీరోకి ఇలా జరగడంపై ఫ్యాన్స్ తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న తంగలాన్ ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. విక్రమ్ గాయం నుంచి కోలుకొని తిరిగి రాగానే బ్యాలెన్స్ షూటింగ్ ని కంప్లీట్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతానికి విక్రమ్ గాయపడడంతో చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story