అక్కినేని హీరో కోసం విషాదమైన ప్రేమ కథ

Ruthvik
Published on: 25 Feb 2019 12:48 PM IST
అక్కినేని హీరో కోసం విషాదమైన ప్రేమ కథ
X

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్న 'మజిలీ' సినిమాలో నటిస్తున్నాడు. సమంత, నాగచైతన్య పెళ్లి అయిన తరువాత కలిసి నటిస్తున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాగచైతన్య ఒక సినిమా చేయనున్నాడు. యు.వి.క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు కానుంది.

తాజా సమాచారం ప్రకారం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ నాగ చైతన్య కోసం ఒక మంచి ప్రేమ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పాత 'దేవదాస్' కథ ఆధారంగా చైతు కోసం ఒక విషాదాంత ప్రేమ కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసినట్లు సినీ వర్గాల భోగట్టా. మరి ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించనున్నారు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటిదాకా నాగచైతన్య నటించిన హ్యాపీ ఎండింగ్ సినిమాలు కూడా డిజాస్టర్ లు అయ్యాయి ఈ నేపథ్యంలో విషాదాంతమైన కథ చై కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Ruthvik

Ruthvik

Next Story