Vijay Sethupathi: 'విక్రమ్' సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి!

Vijay Sethupathi: 'విక్రమ్' సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి చేయనున్నట్లు సమాచారం.

Kranthi
Updated on: 6 April 2021 5:23 PM IST
Vijay Sethupathi to Play Villain Role in the Vikram Movie
X

Vijay Sethupati: (File Image)

Vijay Sethupathi: ఇటీవల తమిళనాడు లో రాజకీయ పార్టీ పెట్టిన లోకనాయకుడు కమల్ హాసన్ 'భారతీయుడు' సీక్వెల్ తో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' అనే సినిమాని కూడా కమిట్ అయ్యాడు. 'భారతీయుడు' సగం వరకు షూటింగు జరుపుకుని, దర్శక నిర్మాతల మధ్య అభిప్రాయభేదాల కారణంగా నిలిచింది. ఇక లోకేశ్ కనగరాజ్ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను కూడా గతంలోనే రిలీజ్ చేశారు. అయితే తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో దీనిని కూడా పక్కన పెట్టేశారు. ఈ గ్యాప్ లో ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారట దర్శకుడు లోకేశ్.

ఈ క్రమంలో 'విక్రమ్' సినిమాలో విలన్ పాత్ర కోసం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో బాగా క్రేజ్ తెచ్చుకున్న ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నట్టు చెబుతున్నారు. అయితే, రానున్న రెండేళ్ళ వరకు విజయ్ సేతుపతి డైరీ ఖాళ్ళీ లేదనే వార్తలు కూడా వినబడుతున్నాయి. డేట్స్ సర్దుబాటు కాక కొన్ని సినిమాలను వదులుకుంటున్నాడని కూడా టాక్. అయితే తాజాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది.

'విక్రమ్' సినిమాలో విజయ్ సేతుపతి నటించబోతున్నాడన్న వార్తలు కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయట. వాస్తవంగా ఈ సినిమాలో ముందు ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ విలన్ పాత్రలో నటించబోతున్నాడన్న వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి లారెన్స్ తప్పుకొని ఆ ప్లేస్‌లో విజయ్ సేతుపతి వచ్చి చేరినట్టు లేటెస్ట్ అప్‌డేట్. అయితే మేకర్స్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక విజయ్ సేతుపతి బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నటిస్తున్న 'లాల్‌సింగ్ చద్దా', టాలీవుడ్‌లో 'పుష్ప' సినిమాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా రీసెంట్‌గా వచ్చిన 'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరింతగా దగ్గరయ్యాడు. 'విక్రమ్' సినిమా టీజర్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Kranthi

Kranthi

Next Story