మెగా హీరో కోసం విలన్ గా మారనున్న స్టార్ హీరో

మెగా హీరో కోసం విలన్ గా మారనున్న స్టార్ హీరో
x
Highlights

మెగా హీరోల జాబితా ఇప్పుడు మరొక పేరు చేరనుంది. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్‌ తేజ్ ఇప్పుడు టాలీవుడ్ లో హీరోగా పరిచయం కానున్నాడు. కొత్త...

మెగా హీరోల జాబితా ఇప్పుడు మరొక పేరు చేరనుంది. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్‌ తేజ్ ఇప్పుడు టాలీవుడ్ లో హీరోగా పరిచయం కానున్నాడు. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రియాలిస్టిక్ ప్రేమ కథ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం బెస్తవాళ్ల బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం.

అంతే కాక, ఈ సినిమాలో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఆ పాత్ర కోసం కోలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద హిట్ల వర్షం కురిపిస్తున్న విజయ్ సేతుపతి ని సంప్రదించగా విజయ్ కూడా ఒప్పుకునట్టు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. శ్యామ్ దత్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. విజయ్ సేతుపతి చిరు తో 'సై రా' లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొక మెగా హీరో కోసం కోలీవుడ్ హీరో విలన్ గా మారనున్నాడు అన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories