Vijay Sethupathi: కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి

Vijay Sethupathi: తమిళనాడు సీఎం కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు హీరో విజయ్ సేతుపతి అందజేశారు.

Kranthi
Updated on: 15 Jun 2021 2:55 PM IST
Vijay Sethupathi Donates 25 Lakhs to CM Relief Fund
X

నటుడు విజయ్ సేతుపతి (ఫైల్ ఇమేజ్)

Vijay Sethupathi: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి భారత్ ను కూడా ఓ ఆటఆడేసుకుంది. ఈ క్రమంలో చాలా మందికి సరైన వదైయం, ఆహారం అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటునానరు. మరోవైపు మహమ్మారికి లక్షల సంఖ్యలో బలై వేలాది కుటుంబాలు వీధిన పడ్డారు. అంతే కాకుండా లాక్ డౌన్ తో పని దొరకక లక్షలాది మంది అర్థాకలితో అలమటిస్తున్నారు. వీరిని ఆదుకునేందుకు అనేక మంది వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా దక్షిణాది నటుడు స్టార్ హీరో..విజయ్ సేతుపతి కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు.

విజయ్ సేతుపతి తమిళనాడు ముఖ్యమంత్రి కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు రూ .25 లక్షలు అందించారు. నటుడు టిఎన్ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను సచివాలయంలో కలుసుకుని ఆ మొత్తానికి చెక్కును సమర్పించారు. తాజాగా టాలీవుడ్ లో మరో సినిమా అవకాశం దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీలో విజయ సేతుపతి నటించాడనున్నాడట.

Kranthi

Kranthi

Next Story