Sundeep - Vijay New Movie: సేతుపతితో సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమా

Sandeep Reddy
Updated on: 2 Aug 2021 1:33 PM IST
Vijay Sethupathi And Sundeep Kishan Join Hands to New Movie Announced by Sundeep Kishan Twitter
X

Vijay Sethupathi And Sundeep Kishan - (Photo: Twitter)

Sundeep - Vijay Sethupathi New Movie: తమిళ చిత్ర పరిశ్రమలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలనటుడిగా తన 16 ఏళ్ళ వయసులో నమ్మవార్ చిత్రంలో చిన్న రోల్ చేసిన విజయ్ హీరోగా కాస్త లేట్ గా ఎంట్రీ ఇచ్చిన తన నటనతో మ్యానరిజంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అటు హీరోగానే కాకుండా విలన్ పాటలను పోషిస్తూ తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఇటీవల విడుదలైన ఉప్పెన చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన విజయ్ త్వరలో మరో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం తమ పెద్ద అన్న విజయ్ సేతుపతితో కలిసి త్వరలో సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఈ చిత్రం అటు తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానునట్లు తెలుస్తుంది. అయితే ఉప్పెన, మాస్టర్ వంటి చిత్రాల మాదిరిగానే సందీప్ కిషన్ సినిమాలో కూడా విలన్ పాత్రలో కనిపించబోతున్నడా లేదా అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. ఇక ఇటీవల విడుదలైన "ఏ1 ఎక్స్ ప్రెస్" తో చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ కొట్టిన సందీప్ కిషన్ త్వరలో "గల్లీ రౌడీ" సినిమాతో వెండితెరపై కనిపించనున్నాడు. మరోపక్క విజయ్ సేతుపతి "తుగ్లక్ దర్బార్" అనే తమిళ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ తర్వాత సందీప్ కిషన్, విజయ్ సేతుపతి సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story