దేవరకొండ సినిమా లో హీరోయిన్ గా అనసూయ

తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఎక్కువ మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా లను అందుకున్న విజయ్ ఒక ప్రొడక్షన్ బ్యానర్ ను కూడా స్థాపించిన సంగతి తెలిసిందే.

Ruthvik
Published on: 19 Jan 2019 11:28 AM IST
Vijay Deverakonda
X
Vijay Deverakonda

తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఎక్కువ మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా లను అందుకున్న విజయ్ ఒక ప్రొడక్షన్ బ్యానర్ ను కూడా స్థాపించిన సంగతి తెలిసిందే. 'కింగ్ అఫ్ ది హిల్' అనే పేరుతో ఈ బ్యానర్ పాపులర్ అయింది. ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తన మొట్టమొదటి సినిమా 'పెళ్లి చూపులు' సినిమా దర్శకుడైన తరుణ్ భాస్కర్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తానని చెప్పాడు. ఇప్పుడు తన మాట నిలబెట్టుకో బోతున్నాడు విజయ్ దేవరకొండ.

తరుణ్ భాస్కర్ హీరోగా, విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ బ్యానర్ ఒక సినిమా తెరకెక్కనుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే యాంకర్ అనసూయ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. అయితే తరుణ్ భాస్కర్, అనసూయ మాత్రమే కాక మరో ఇద్దరు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ నలుగురి పాత్రల చుట్టూ సినిమా తిరగనుంది. మిగతా రెండు పాత్రల్లో ఎవరు చేయనున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. హీరో గా ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దేవరకొండ నిర్మాతగా ఎంతవరకు మెప్పించగలడో వేచి చూడాలి.

Ruthvik

Ruthvik

Next Story