Liger: మే నుంచి హైదరాబాద్‌లో లైగర్ షూటింగ్

Vijay Deverakonda Liger Movie
x

లైగర్ మూవీలో విజయ్ దేవరకొండ (ఫొటో హన్స్ ఇండియా)

Highlights

Liger: విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న 'లైగర్' సినిమాపై టాలీవుడ్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Liger: యంగ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న 'లైగర్' సినిమాపై టాలీవుడ్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రం ఇతర భాషలలో కూడా విడుదల కానుంది. దీంతో పాన్ ఇండియా వ్యాప్తంగా అదే రేంజ్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో బాక్సర్ గా నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ ప్రారంభమైనప్పటి నుంచి పూరి జగన్ ఈ చిత్రాన్ని ముంబైలోనే షూట్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో షూట్ చేయకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలు అవాస్తవమని తెలుస్తున్నాయి. మే నెలలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం లైగర్ టీం హైదరాబాద్‌కు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జూన్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లైగర్ సినిమాను విడుదల చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories