Gully Rowdy: 'గల్లీ రౌడీ' ని లాంఛ్ చేసిన లైగర్

Venkata Chari
Updated on: 20 April 2021 6:51 AM IST
Vijay Deverakonda Launches Teaser Of Sundeep Kishan Gully Rowdy
X

గల్లీ రౌడీ టీజర్ లాంఛ్

Gully Rowdy: జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహా శర్మ హీరో, హీరోయిన్‌గా రూపొందిన చిత్రం 'గల్లీ రౌడీ'. ఈ సినిమా టీజర్‌ని విజయ్ దేవరకొండ నేడు(సోమవారం) విడుదల చేశాడు.

'ఏ1 ఎక్స్‌ప్రెస్‌' తరువాత సందీప్ 'గల్లీ రౌడీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కుటంబం బలవంతం వల్ల రౌడీగా మారిన వ్యక్తిగా సందీప్ ఇందులో కనిపిస్తున్నాడు. 'బాబు రావాలి.. రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు' అంటూ పోసాని కృష్ణ మురళీ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది. చివరి వరకు నవ్వులు పూయిస్తుంది ఈ టీజర్.

హీరోయిన్‌తో కలిసి హీరో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసే నేపథ్యంలో కథ సాగుతుంది. అయితే వాళ్లు ఎవరిని కిడ్నాప్ చేస్తారనే విషయాన్ని సస్పెన్స్‌లో ఉంచారు. చివరిగా 'ఎవరైనా మనవడిని డాక్టర్ చేస్తాడు.. లేదా ఇంజనీర్ చేస్తాడు.. మరీ డబ్బుంటే ఎంఎల్‌ఏని చేస్తాడు.. ఈ రౌడీని చేయడం ఏంటీ రా' అని హీరోని ప్రశ్నిస్తే... 'నెపోటిజం రా' అంటూ అతను సమాధానం చెప్పడంతో టీజర్ ముగుస్తుంది.

ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్లపై కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేదీని మాత్రం టీజర్‌లో ప్రకటించలేదు.

Venkata Chari

Venkata Chari

Next Story