ముద్దు సన్నివేశాలతోనే సినిమాలు ఆడవు : విజయ్ దేవరకొండ

ముద్దు సన్నివేశాలతోనే సినిమాలు ఆడవు : విజయ్ దేవరకొండ
x
Highlights

'సినిమాల్లో ముద్దు సన్నివేశాలు అనేవి ఆయా పాత్రల ఎమోషన్, అక్కడ ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తున్నాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చూడాలి. అలాంటి...

'సినిమాల్లో ముద్దు సన్నివేశాలు అనేవి ఆయా పాత్రల ఎమోషన్, అక్కడ ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తున్నాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చూడాలి. అలాంటి సన్నివేశంలో నేను కనిపించకూడదు. నా పాత్ర మాత్రమే కనిపించాలి. ఇప్పుడు ఈ సినిమాలో మీకు విజయ్ కనిపించకూడదు.. బాబీ కనిపించాలి. అవి కథలను బట్టి, ఆయా పాత్రలను బట్టి ఉంటాయే తప్ప, కావాలని ముద్దు సన్నివేశాలు హిట్టవ్వవు." అంటున్నాడు విజయ్ దేవరకొండ. 'డియర్ కామ్రేడ్' చిత్రంలోని ముద్దు సన్నివేశాలపై ఈ విధంగా రెస్పాండయ్యాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తోన్న చిత్రం 'డియ‌ర్ కామ్రేడ్‌'. 'ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌' అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు. జూలై 26న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పాడు.

' కొత్త దర్శకులు కొత్త కొత్త ఆలోచనలతో వస్తున్నారు. మేము మొదలు పెట్టినప్పుడు కొత్తవాళ్ళమే కదా. ఇక్కడ స్టార్ దర్శకులు ఊరికే అవకాశాలు ఇవ్వరు. మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటేనే అవకాశాలు వస్తాయి. నేను హీరో అవ్వాలనుకున్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశా. అప్పుడు మనం ఎవరో ఎవరికీ తెలియదు కదా.. అందుకే మనలా తపన ఉండి దర్శకులుగా అవ్వాలని ప్రయత్నించే వాళ్ళకోసం చూసా. ఆ క్రమంలోనే నాకు తరుణ్, సందీప్, భరత్‌లు కలిశారు. ఆ తపన ఉన్నవాళ్లతో సినిమా చేశాను కాబట్టే.. ఈ రోజు సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను..'' అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories