మళ్లీ అలాంటి సినిమా చేయబోతున్న విజయ్ దేవరకొండ

మళ్లీ అలాంటి సినిమా చేయబోతున్న విజయ్ దేవరకొండ
x
Highlights

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ. ఈమధ్యనే 'టాక్సీవాలా' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్స్' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ. ఈమధ్యనే 'టాక్సీవాలా' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్స్' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 'గీత గోవిందం' లో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యూత్ లీడర్ గా ఒక సరి కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాలను కూడా లైన్లో పెట్టేస్తున్నాడు.

ఈ మధ్యనే విజయ్ దేవరకొండ ఒక ద్విభాషా సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. నిజానికి 'టాక్సీవాలా' కి ముందు విడుదలైన 'నోటా' సినిమా కూడా ద్విభాషా చిత్రమే. తెలుగు తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా రెండు భాషల్లోనూ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఒక కొత్త దర్శకుడు రెండు భాషల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ చెప్పడంతో విజయ్ కూడా మరొక్కసారి ఒక ద్విభాషా చిత్రం చేయడానికి ఒప్పుకున్నాడు. 'డియర్ కామ్రేడ్' సినిమా పూర్తయ్యాక విక్రమ్ కుమార్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories