మరొక ఘనత చేజిక్కించుకున్న విజయ్ దేవరకొండ

Ruthvik
Published on: 5 Feb 2019 12:57 PM IST
మరొక ఘనత చేజిక్కించుకున్న విజయ్ దేవరకొండ
X

టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకుంటూ స్టార్ హీరో గా మారడానికి రెడి అవుతున్న టాలీవుడ్ సెన్సాషల్ హీరో విజయ్ దేవరకొండ ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ తన ఇండియా ఎడిషన్ లో ప్రకటించిన టాప్ 30 లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు. యువ పారిశ్రామిక వేత్తలు ఎవరైతే కొత్త శిఖరాలకు చేరుకున్నారో వాళ్ళను ఎంచుకునే ఫోర్బ్స్ అందులో 29వ స్థానాన్ని విజయ్ దేవరకొండకు ఇచ్చింది. ఎంటర్ టైన్మెంట్ మరియు మ్యూజిక్ క్యాటగిరీలో విజయ్ కు ఈ ఘనతను దక్కింది.

ఒకవైపు హీరోగా 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాల' లాంటి హిట్ లు నమోదు చేసుకోవడమే కాక మరొక వైపు విజయ్ దేవరకొండ 'కింగ్ ఆఫ్ ది హిల్' అనే బ్యానర్ తో నిర్మాతగా కూడా మారనున్నాడు. ఇవే కాక రౌడీ వేర్ అనే బట్టల బ్రాండ్ కూడా స్థాపించాడు ఈ యువ హీరో. అందుకే ఇపుడు ఫోర్బ్స్ జాబితాలో చేరిపోయాడు. ఇక సినిమాల పరంగా ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమా లో స్టూడెంట్ లీడర్ గా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ చేతిలో మరో మూడు ప్రాజెక్ట్స్ ఉండడం విశేషం.

Ruthvik

Ruthvik

Next Story