'ఎన్టీఆర్ మహానాయకుడు' విడుదల తేది ప్రకటించిన బసవతారకం

ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల తేది ప్రకటించిన బసవతారకం
x
Highlights

ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం గా "'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా జనవరి 9వ తారీఖున విడుదలైంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో మెప్పించారు. భారీ...

ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం గా "'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా జనవరి 9వ తారీఖున విడుదలైంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో మెప్పించారు. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఇక అందరి కన్ను సినిమా రెండవ భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు' పైనే ఉంది. నందమూరి తారకరామారావు గారి రాజకీయ జీవితాన్ని జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తయింది.

ఇక ఈ సినిమా విడుదల ఎప్పుడు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర పోషించిన విద్యాబాలన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ఫిబ్రవరి 22 వ తారీఖు న విడుదల కానుందని ఆ పనుల్లో దర్శకుడు క్రిష్ బిజీగా ఉన్నాడు అంటూ క్రిష్ ఫోటో పోస్ట్ చేసింది విద్యాబాలన్. అలా ఈ సినిమా రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించింది విద్య బాలన్. మరి ఈ సినిమా అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories