Breaking News: ప్రముఖ గాయని వాణీ జయరాం హఠాన్మరణం

Breaking News: ప్రముఖ గాయని వాణీ జయరాం హఠాన్మరణం

Arun Chilukuri
Updated on: 4 Feb 2023 2:58 PM IST
Veteran Singer Vani Jayaram Passes Away
X

Breaking News: ప్రముఖ గాయని వాణీ జయరాం హఠాన్మరణం

Vani Jayaram: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్‌ వాణీ జయరాం హఠాన్మరణం చెందారు. చెన్నైలోని తన నివాసంలో అనారోగ్యంతో ఆమె తుదిశ్వాస విడిచారు. వాణీ జయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు 8వేలకు పైగా పాటలు ఆలపించారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న జన్మించిన ఆమె అసలు పేరు కలైవాణి. ఇటీవలే కేంద్రం ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story