Surekha Sikri Suffers Brain Stroke : 'చిన్నారి పెళ్లికూతురు' బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్.. ఐసీయూలో చికిత్స

Surekha Sikri Suffers Brain Stroke : ప్రముఖ ఛానల్ లో ఒకప్పుడు ప్రసారం అయిన 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ అందరికి గుర్తుండే ఉంటుంది..

Krishna
Published on: 9 Sept 2020 12:03 PM IST
Surekha Sikri Suffers Brain Stroke : చిన్నారి పెళ్లికూతురు బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్.. ఐసీయూలో చికిత్స
X

 Surekha Sikri 

Surekha Sikri Suffers Brain Stroke : ప్రముఖ ఛానల్ లో ఒకప్పుడు ప్రసారం అయిన 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ అందరికి గుర్తుండే ఉంటుంది.. ఈ సీరియల్ లో నటించే బామ్మా 'సురేఖా సిక్రి ' తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే గత రాత్రి (మంగళవారం) ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో ఆమెను వెంటనే ముంబై లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకి ఐసీయూలో చికిత్స జరుగుతుంది. ఆమెకి ఇలా బ్రెయిన్ స్ట్రోక్‌ రావడం రెండోసారని కుటుంబ సభ్యులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో 2018లో ఆమెకు పక్షవాతం వచ్చినప్పుడు మొదటిసారి ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్‌ ఎటాక్ అయింది. ప్రస్తుతం ఆమె వయస్సు 75 సంవత్సరాలు..

చిన్నారి పెళ్లికూతురుతో పాటుగా పలు సీరియళ్ళతో పాటుగా సినిమాల్లో కూడా నటించి మెప్పించింది సురేఖా సిక్రి.. ఆమె మొత్తం ఇప్పటివరకూ మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. 'తమస్' (1988), 'మమ్మో' (1995), 'బధాయి హో' (2018) సినిమాలకి గాను ఆమెకి అవార్డులు లభించాయి. చివరగా ఆమె జోయా అక్తర్ దర్శకత్వంలో వచ్చిన 'ఘోస్ట్ స్టోరీస్‌'లో జాన్వీ కపూర్‌తో కలిసి నటించారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అటు ఆమె ఆర్ధిక ఇబ్బందులను సైతం ఎదురుకుంటున్నారు.. ఆమె ప్రస్తుతం బాగానే ఉన్నట్టుగా బాలీవుడ్ నటుడు సోనుసూద్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.



Krishna

Krishna

Next Story