Veteran Actor Jagdeep Passes Away: బాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Veteran Actor Jagdeep Passes Away: బాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
x
Jagdeep Passes away
Highlights

Veteran Actor Jagdeep Passes Away: బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు జగదీప్(81) అలియాస్‌ సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ మరణించారు.

Veteran Actor Jagdeep Passes Away: బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు జగదీప్(81) అలియాస్‌ సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు జగదీప్.. ఈ క్రమంలో ముంబైలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి 8:40 గంటలకు తుదిశ్వాస విడిచారు. మార్చి 29, 1939న జన్మించిన జగదీప్‌కు ఇద్దరూ కుమారులు జావేద్ జాఫ్రీ, నవేద్ జాఫ్రీలు ఉన్నారు. 1975 లో వచ్చిన షోలే లో సూర్మ భోపాలి పాత్రను పోషించాడు.. 1988 లో అదే పేరుతో సూర్మ భోపాలి అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఆయనొక నామమాత్రపు పాత్రను కూడా పోషించారు. ఆ తరువాత అండాజ్ అప్నా అప్నా, బ్రహ్మచారి, నాగిన్ వంటి చిత్రాలు కలిపి మొత్తం400 కి పైగా చిత్రాలలో నటించారు. జగదీప్ 70 , 80 లలో అలాగే 90 లలో కూడా అనేక పెద్ద బాలీవుడ్ చిత్రాలలో నటించారు.

ఆయన మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ గా గుర్తింపు పొందాడు. రేపు ముంబై లోని షియా కబ్రిస్తాన్ వద్ద జగదీప్ అంత్యక్రియలు జరపనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతికి బాలీవుడ్‌ ప్రముఖులు, నటీనటులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కాగా జగదీప్ మరణ వార్తపై స్పందించిన అజయ్ దేవ్‌గన్ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ ఇలా అన్నారు. "జగదీప్ సాబ్ మరణించిన విషాద వార్త విన్నాను. అతన్ని తెరపై ఎప్పుడూ చూసినా ఆనందించేవాడిని. ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని కలిగించాడు. జగదీప్ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories