ఈ మధ్యాహ్నం వేణుమాధవ్ అంత్యక్రియలు

నిన్న మధ్యాహ్నం యశోద ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ స్టార్ కమెడియన్ వేణుమాధవ్ అంతిమ శ్వాస విడిచిన విషయం విదితమే.

K V D Varma
Updated on: 26 Sept 2019 11:41 AM IST
ఈ మధ్యాహ్నం వేణుమాధవ్ అంత్యక్రియలు
X

నిన్న మధ్యాహ్నం యశోద ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ స్టార్ కమెడియన్ వేణుమాధవ్ అంతిమ శ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన మరణం పట్ల సినీ అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన వారు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.

కాగా, ఇప్పటికే ఆసుపత్రి నుంచి వేణుమాధవ్ స్వగృహానికి ఆయన భౌతిక కాయాన్ని చేర్చారు. అక్కడ నుంచి ఈ ఉదయం 10:30 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ కు తరలిస్తారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మౌలాలీ లోని ఎస్టేట్ లో వేణుమాధవ్ అంత్యక్రియలు జరుపుతారు.


K V D Varma

K V D Varma

Next Story