'వెంకీ మామ' సినిమాలో వెంకీ పాత్ర ఇలా ఉండబోతుంది

వెంకీ మామ సినిమాలో వెంకీ పాత్ర ఇలా ఉండబోతుంది
x
Highlights

ఈ మధ్యనే 'ఎఫ్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. వరుణ్ తేజ్ మరియు వెంకీ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో...

ఈ మధ్యనే 'ఎఫ్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. వరుణ్ తేజ్ మరియు వెంకీ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాక బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత మరొక మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు వెంకీ. ఇప్పటికే వెంకీ మరియు అక్కినేని నాగచైతన్య హీరోలుగా 'వెంకీ మామ' అనే మల్టీ స్టారర్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకీ పాత్రపై ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ ఒక్క ఒక పల్లెటూరి వాడి గా కనిపించనున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని ఇక ఈ సినిమాలో వెంకటేష్ పండించే కామెడీ సినిమాకు హైలైట్ అవుతుందని తెలుస్తోంది. చూస్తూ ఉంటే 'ఎఫ్ 2' సినిమా లో లాగానే ఈ సినిమాలో కూడా ప్రేక్షకులను నవ్వించేందుకు వెంకీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కే. ఎస్ రవీంద్ర అలియాస్ బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories