చాలా కాలం తర్వాత హిందీ సినిమా చేయబోతున్న వెంకటేష్

*చాలా కాలం తర్వాత హిందీ సినిమా చేయబోతున్న వెంకటేష్

Rama Rao
Updated on: 6 May 2022 10:48 AM IST
Venkatesh Will Play the Lead Role in Salman Khans Film
X

చాలా కాలం తర్వాత హిందీ సినిమా చేయబోతున్న వెంకటేష్

Venkatesh: సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ లో కూడా సుపరిచితులే. "అనారి" సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టిన వెంకటేష్ ఆ తర్వాత తర్వాత "తకదీర్ వాలా" సినిమాలో కూడా నటించారు. అయితే ఆ సినిమా తర్వాత వెంకటేష్ కేవలం తెలుగు సినిమాల పైన మాత్రమే దృష్టి పెట్టారు. చాలా వరకు వెంకటేష్ నటించిన తెలుగు సినిమాలు హిందీలో కూడా డబ్ అవడంతో వెంకీ కి బాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

తాజా సమాచారం ప్రకారం చాలా ఏళ్ల తరువాత మళ్లీ వెంకటేష్ హిందీలో ఒక స్టార్ హీరో సినిమాలో ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే "రాధే" సినిమాతో డిజాస్టర్ అందుకున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా ఇప్పుడు "కభి ఈద్ కభి దివాళి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫర్హద్ సంజి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ ఏడాది ఆఖరులో విడుదల కాబోతోంది.

సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ఈ సినిమాలో ఒక ఫుల్ లెంత్ పాత్ర పోషించనున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ స్వయంగా వెంకటేష్ ను కలిసి ఈ సినిమా కోసం ఒప్పించినట్లు తెలుస్తోంది. దీని గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story