మొట్టమొదటిసారి భార్య గురించి చెప్తున్న వెంకీ

venkatesh
x
venkatesh
Highlights

'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమా లో ఒక ప్రస్టేటెడ్ భర్త పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం వెంకీ గా చెప్పుకోవచ్చు.

'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమా లో ఒక ప్రస్టేటెడ్ భర్త పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం వెంకీ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ప్రమోషన్స్ లో తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు వెంకీ. మొట్టమొదటిసారిగా ఆయన భార్య గురించి మాట్లాడుతూ "ఆవిడతో జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె నా పక్కన ఉంటే నేను రెచ్చిపోతాను. మా ఆవిడ నా పక్కనుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది." అని చెప్పారు.

అంతే కాక, "ప్రతి ఒక్కరికి భార్య పక్కన ఉంటేనే ఎనర్జీ వస్తుంది అని నేను నమ్ముతాను. ప్రతి రోజు సాయంత్రం నా భార్యకు నేను కొంత సమయాన్ని కేటాయిస్తాను. ఆ సమయంలో మేము మాట్లాడుకుంటాం, కలిసి భోజనం చేస్తాము లేదంటే రెస్టారెంట్ కు వెళతాం" అని కూడా చెప్పుకొచ్చాడు వెంకీ. మామూలుగా అయితే భార్య ఇంట్లో లేకపోతే భర్త రెచ్చిపోతాడని అందరూ అంటారు కానీ తనకు మాత్రం తన పక్కన భార్య ఉంటే చాలు అంటున్నాడు ఈ సీనియర్ హీరో.





Show Full Article
Print Article
Next Story
More Stories