'నేను లోకల్' దర్శకుడితో వెంకీ

నేను లోకల్ దర్శకుడితో వెంకీ
x
Highlights

చాలా కాలం తర్వాత మళ్లీ కామెడీ పాత్రలో 'ఎఫ్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విక్టరీ వెంకటేష్. తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు....

చాలా కాలం తర్వాత మళ్లీ కామెడీ పాత్రలో 'ఎఫ్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విక్టరీ వెంకటేష్. తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ వెంకీ ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడట. వెంకీ తదుపరి సినిమా త్రినాధ రావు దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాను ఫిబ్రవరిలో రామానాయుడు స్టూడియోస్ లో అధికారికంగా లాంచ్ చేయనున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇక వెంకీ చేతిలో 'వెంకీ మామ' వంటి కొన్ని సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. మరోపక్క 'సినిమా చూపిస్తా మామ', 'నేను లోకల్' సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న త్రినాధరావు నక్కిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. ఈసారి వెంకీ సినిమా తో కచ్చితంగా హిట్ అందుకోవాలని ఎదురు చూస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories