VarunLav: ఘనంగా వరుణ్ లావణ్య రిసెప్షన్.. తరలి వచ్చిన సినీ ప్రముఖులు..

VarunLav: మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌లో రిసెప్షన్

Jyothi
Published on: 6 Nov 2023 7:58 AM IST
VarunLav Grand Wedding Reception In Hyderabad
X

VarunLav: ఘనంగా వరుణ్ లావణ్య రిసెప్షన్.. తరలి వచ్చిన సినీ ప్రముఖులు..

VarunLav: టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి వివాహం ఇటీవల ఇటలీలోని టస్కనీలో జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఈ భారీ విందు కార్యక్రమానికి వేదికగా నిలిచింది. టాలీవుడ్ తారల రాకతో రిసెప్షన్ కార్యక్రమం కళకళలాడింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు అలీ, మురళీమోహన్, నాగచైతన్య, దగ్గుబాటి పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్, టి.సుబ్బరామిరెడ్డి, యాంకర్ సుమ, బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్ తదితర ప్రముఖులు విచ్చేశారు.















Jyothi

Jyothi

Next Story