logo

నాలుగు బుల్లెట్లు సంపాయిత్తే.. రెండు కాల్చుకోవాలే.. రెండు దాచుకోవాలే.. వాల్మీకి టీజర్ వచ్చేసింది!

నాలుగు బుల్లెట్లు సంపాయిత్తే.. రెండు కాల్చుకోవాలే.. రెండు దాచుకోవాలే.. వాల్మీకి టీజర్ వచ్చేసింది!
Highlights

మెగా ట్యాగ్ లైన్ ఉన్నాగానీ మొదట్నుంచీ తనదైన బాటలోనే సాగుతున్నారు వరుణ్ తేజ్. సినిమాల ఎంపికలో ఆచి తూచి వ్యవహరించడం. విభిన్న సినిమాల్ని ఎంచుకోవడం ఆయన విధానం. ముకుందా నుంచి ఎఫ్ 2 వరకూ అయన నటించిన సినిమాలే ఇందుకు నిదర్శనం. తాజాగా వరుణ్ నటిస్తున్న వాల్మీకి టీజర్ ఈరోజు విడుదలైంది.

మెగా ట్యాగ్ లైన్ ఉన్నాగానీ మొదట్నుంచీ తనదైన బాటలోనే సాగుతున్నారు వరుణ్ తేజ్. సినిమాల ఎంపికలో ఆచి తూచి వ్యవహరించడం. విభిన్న సినిమాల్ని ఎంచుకోవడం ఆయన విధానం. ముకుందా నుంచి ఎఫ్ 2 వరకూ అయన నటించిన సినిమాలే ఇందుకు నిదర్శనం. ఒకదానితో ఒకటి సంబంధంలేని జోనర్లు.. కథలు అవన్నీ.. కూల్ గా తన పని తాను చేసుకుపోయే వరుణ్ ఇప్పుడు మరో సరికొత్త స్టైల్ లో మనముందుకు రాబోతున్నారు.

తమిళంలో సూపర్ హిట్ అయిన జిగార్తండ సినిమాని హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి గా తెలుగు తెరకు ఎక్కిస్తున్నారు.

ఈసినిమా ఫస్ట్ లుక్.. ప్రీ టీజర్ అందర్నీ ఆకట్టుకున్నాయి. వీటిలో కనిపించిన వరుణ్ లుక్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇక ప్రేక్షకుల్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరింత సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు వాల్మీకి టీం. వాల్మీకి టీజర్ ను ఈ సాయంత్రం విడుదల చేశారు.

ఈ టీజర్‌లో వరుణ్ లుక్, యాటిట్యూబ్ భయానకంగా ఉన్నాయి. ఆ పాత్రలో వరుణ్ నటన అయితే, మామూలుగా లేదు. ''అందుకే పెద్దోళ్లు చెప్పిరు.. నాలుగు బుల్లెట్లు సంపాయిత్తే రెండు కాల్చుకోవాలే, రెండు దాచుకోవాలే'' అంటూ వరుణ్ చెప్పే డైలాగ్ టీజర్‌కు హైలైట్ గా నిలిచింది.

పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్లు గా నటిస్తున్న వాల్మీకి కి మిక్కి జె.మేయ‌ర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఐనాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
లైవ్ టీవి


Share it
Top