27 న సినిమా లాంచ్ చేయనున్న మెగా హీరో

27 న సినిమా లాంచ్ చేయనున్న మెగా హీరో
x
Highlights

ఈ మధ్యనే 'అంతరిక్షం' సినిమాతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ, మెగా హీరో వరుణ్ తేజ్ 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు.

ఈ మధ్యనే 'అంతరిక్షం' సినిమాతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ, మెగా హీరో వరుణ్ తేజ్ 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన 'జిగర్తాండ' అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కనుంది.

సిద్ధార్థ్ మరియు బాబి సింహ ముఖ్య పాత్రలు పోషించిన 'జిగర్తాండ' సినిమా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో గ్యాంగ్స్టర్ కామెడీగా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఈ నెల 27 వ తారీఖున అధికారికంగా లాంచ్ చేయనున్నారు. రామ్ ఆచంట మరియు గోపి ఆచంట 14 reels ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయాంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories