మెగా కుటుంబంలో పెళ్లి భాజాలు.. త్వరలో వరుణ్, లావణ్య ఎంగేజ్ మెంట్.. ముహూర్తం ఫిక్స్..?

Varun Tej: మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ మరోసారి పెళ్లి ముచ్చటతో వార్తలకు ఎక్కాడు.

Arun Chilukuri
Published on: 17 May 2023 11:31 AM IST
Varun Tej Getting Engagement With Lavanya Tripathi in June 2023
X

మెగా కుటుంబంలో పెళ్లి భాజాలు.. త్వరలో వరుణ్, లావణ్య ఎంగేజ్ మెంట్.. ముహూర్తం ఫిక్స్..?

Varun Tej: మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ మరోసారి పెళ్లి ముచ్చటతో వార్తలకు ఎక్కాడు. వచ్చే నెల జూన్ లో తనకు నచ్చిన అమ్మాయితో వరుణ్ ఎంగేజ్ మెంట్ చేసుకుంటాడని అనీ కుదిరితే ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకుంటాడని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక, వరుణ్ తేజ్ పెళ్లాడబోయేది కూడా మరెవరినో కాదు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠినే..ఔను, వరుణ్-లావణ్యల పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు సమ్మతం తెలపడంతో జూన్ లో రెండు కుటుంబాలతో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో ఎంగేజ్ మెంట్ చేసుకోవాలని వరుణ్, లావణ్య డిసైడ్ అయ్యారని సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.

మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. మిస్టర్, అంతరిక్షం సినిమాల సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందని..లావణ్య పుట్టినరోజును సెలబ్రేట్ చేసేందుకే వరుణ్ తేజ్ బెంగళూరు వెళ్లాడని..అక్కడే ఆమెకు ప్రపోజ్ చేశాడని గత ఏడాదిలో నెట్టింట వీరి లవ్ వార్తలు మోత మోగించాయి. ఈ ప్రచారం పై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన లేదు కానీ లావణ్య మాత్రం రియాక్ట్ అయింది. అందరూ చెబుతున్నట్లు తాను బెంగళూరులో లేనని తన సొంతూరు డెహ్రాడూన్ లో కుటుంబంతో కలిసి ఉన్నానంటూ అక్కడి ఫోటోలను షేర్ చేసింది.

లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్ కు చెక్ పడినట్లయింది. ఇక నాగబాబు, ఇటీవలే మీడియా ముందుకొచ్చి వరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని..అమ్మాయి ఎవరనే విషయాన్ని అతడే వెల్లడి చేస్తాడని చెప్పాడు. దీంతో వరుణ్ ఎవరిని పరిచయం చేస్తాడో చూడాలని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా..లావణ్యతో వరుణ్ ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అంటూ పింక్ విల్లా కథనం ప్రచురించింది. మరి, ఈ కథనంలో నిజం ఎంత అనేది తెలియాలంటే మెగా కుటుంబం నుంచి ఏదైనా ప్రకటన రావాల్సిందే. కనీసం లావణ్య అయినా చిన్నపాటి హింట్ ఇస్తుందేమో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story