VarunLav: మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌ తేజ్ - లావణ్య త్రిపాఠి

VarunLav: దాదాపు ఆరేళ్ల తమ ప్రేమను వివాహబంధంగా మార్చుకున్నారు నటుడు వరుణ్‌ తేజ్‌- నటి లావణ్య త్రిపాఠి.

Arun Chilukuri
Published on: 2 Nov 2023 10:37 AM IST
Varun Tej, Lavanya Tripathi Got Married In Italy
X

VarunLav: మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌ తేజ్ - లావణ్య త్రిపాఠి

VarunLav: దాదాపు ఆరేళ్ల తమ ప్రేమను వివాహబంధంగా మార్చుకున్నారు నటుడు వరుణ్‌ తేజ్‌- నటి లావణ్య త్రిపాఠి. ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్‌ మూడుముళ్లు వేశారు.

చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌.. ఇలా కొణిదెల, అల్లు కుటుంబానికి చెందిన అగ్ర, యువ హీరోలందరూ షూటింగ్స్‌ నుంచి బ్రేక్స్‌ తీసుకుని ఈ వేడుకల్లో సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నితిన్‌, ఆయన సతీమణి షాలినీ, నీరజా కోన ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story