Varun Tej-Lavanya: ఘనంగా వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్.. సందడి చేసిన మెగా, అల్లు ఫ్యామిలీలు

Varun Tej-Lavanya: మెగా హీరో వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది.

Arun Chilukuri
Published on: 10 Jun 2023 10:56 AM IST
Varun Tej and Lavanya Tripathi got Engaged
X

Varun Tej-Lavanya: ఘనంగా వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్.. సందడి చేసిన మెగా, అల్లు ఫ్యామిలీలు

Varun Tej-Lavanya: మెగా హీరో వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీలు మాత్రమే ఈ వేడుకలో సందడి చేసినట్లు తెలుస్తుంది. కొత్త జంటకు మెగా అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

వరుణ్‌తేజ్‌ - లావణ్య ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా సోషల్‌మీడియాలో #VarunLav హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. 2017లో విడుదలైన మిస్టర్‌ సినిమాలో వరుణ్‌ - లావణ్య నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఏడాదిలోనే వీరి కాంబినేషన్‌లో అంతరిక్షం వచ్చింది. ఈ క్రమంలోనే వీరి స్నేహం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story